తనను మళ్లీ గెలిపిస్తే చైనాపై ఆధారపడటాన్ని పూర్తిగా అంతం చేస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. కరోనా వైరస్ అక్కడ నుంచే వచ్చిందన్న విషయం మరిచిపోలేమని వ్యాఖ్యానించారు. అందువల్ల కరోనానంతర కాలంలోనూ చైనాతో సంబంధాలు ఇలాగే ఉంటాయని స్పష్టం చేశారు.
వైరస్ చైనా నుంచే వచ్చిందని మరిచిపోతామా: ట్రంప్ - us election news
మరో నాలుగేళ్లు తనకు అధికారమిస్తే చైనాతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్ అక్కడి నుంచే వచ్చిందన్న విషయాన్ని ఎప్పటికీ మరువబోమన్నారు.
ట్రంప్
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూపోర్ట్ వర్జీనియాలో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతున్న వేళ చైనా వైరస్ కారణంగా దెబ్బతిన్నామని ఆరోపించారు. ఈ పనిని చైనా చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అన్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావం భారీగా పడింది. 2 లక్షల మంది అమెరికన్లు మృత్యువాత పడగా.. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.