తెలంగాణ

telangana

ETV Bharat / international

పర్యావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు - ఆస్ట్రేలియాలో 10 లక్షల మందికి పైగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి  ప్రదర్శన చేపట్టారు.

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తోన్న మార్పులపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనల వెల్లువెత్తుతోంది. ఐక్యరాజ్య సమితి వాతావరణ శిఖరాగ్ర సదస్సు సమావేశానికి ముందే దేశాధినేతలకు తమ నినాదాలు వినిపించేలా, వాతావరణ మార్పుల నుంచి రక్షణ కల్పించాలని  ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకారులు పిలుపునిచ్చారు.

పర్యావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

By

Published : Sep 20, 2019, 6:04 PM IST

Updated : Oct 1, 2019, 8:45 AM IST

పర్యావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

పర్యావరణంలో వస్తోన్న మార్పులకు పరిష్కారం చూపాలంటూ ప్రపంచం ఏకమై నినదిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రీటా థంబర్గ్​ ఇచ్చిన పిలుపుతో సెప్టంబర్​ 20 నుంచి వారం రోజుల పాటు 'గ్లోబల్​ క్లైమెట్​ స్ట్రైక్'​ పేరుతో 156 దేశాల ప్రజలు కాలుష్య నివారణకు ప్రణాళిక రూపొందించాలని ఆందోళనలు చేశారు. ఐక్యరాజ్య సమితి వాతావరణ శిఖరాగ్ర సదస్సుకు ముందే తమ ఉద్దేశాన్ని దేశాధినేతలకు వినిపించేందుకు థింబర్గ్​ ప్రపంచవ్యాప్త ప్రదర్శనలకు పిలుపునిచ్చారు.

దిల్లీలో హొరెత్తిన నిరసనలు

దిల్లీలో తొలిరోజు నిర్వహించిన గ్లోబల్​ క్లైమెట్​ స్ట్రైక్​లో విద్యార్థులు, పర్యావరణవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందు ఆందోళనలు చేపట్టారు. వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే జీవించేందుకు మరొక గ్రహం కూడా లేదని ప్లకార్డులు చేతపట్టి, పది తలల రావణాసురుడి దిష్టిబొమ్మను ప్రదర్శించారు.

వాయు ఉద్గారాలను తగ్గించాలి

ఆస్ట్రేలియాలో 10 లక్షల మందికి పైగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి ప్రదర్శన చేపట్టారు. దేశంలో అధికంగా బొగ్గు, సహజ వాయువు ఎగుమతి ఉన్నందున గ్రీన్​ హౌస్​ తీవ్ర ప్రభావానికి గురవుతోందని గళమెత్తారు. వాయు ఉద్గారాలను వీలైనంత త్వరగా తగ్గించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

హాంకాగ్​లో నిరసన హోరు

హాంకాంగ్​లోనూ వాతావరణ మార్పులపై నిరసనకారులు ప్రదర్శనలు చేపట్టారు. పర్యావరణం మార్పుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

విద్యాసంస్థలు బంద్​

చెక్​ రిపబ్లిక్​లో అన్ని విద్యాసంస్థల్లో శుక్రవారం విద్యార్థులు బంద్​కు పిలుపునిస్తూ పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోవాలంటూ నినదించారు.

ఇదీ చూడండి:'సైనిక చర్యలకు పాల్పడితే.. యుద్ధమే'

Last Updated : Oct 1, 2019, 8:45 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details