ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదుకావటం ఆందోళన కలిగిస్తోంది. శనివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 30 లక్షలు దాటినట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నివేదిక అందించింది.
ఆ నగరాల జనాభాతో సమానం
బ్రెజిల్, భారత్, ఫ్రాన్స్‌లో కరోనా సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. కరోనాతో మరణించినవారి సంఖ్య.. ఉక్రెయిన్‌లోని కియో నగరం, వెనిజువెలాలోని కరాకస్ నగర జనాభా, పోర్చుగల్‌లోని లిస్బాన్ నగరం జనాభాలతో సమానం. ప్రపంచవ్యాప్తంగా ఒక్కోదేశంలో ఒక్కోలా వైరస్ పరివర్తనం చెందుతోంది.