తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మార్క్​ దాటిన కేసులు - అమెరికాలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం కొత్తగా 4.72 లక్షల కేసులు, 8వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 8 కోట్ల మార్క్​ను దాటింది. మరణాలు 17.5 లక్షలకు చేరుకున్నాయి. అమెరికాలోనే అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతుండగా.. ఆ తర్వాత బ్రిటన్​, రష్యాలు ఉన్నాయి.

Worldwide Covid-19 cases latest tally
ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మార్క్​ దాటిన కరోనా కేసులు

By

Published : Dec 26, 2020, 10:30 AM IST

ప్రపంచ దేశాల్లో కరోనా మహావిలయం కొనసాగుతూనే ఉంది. రోజుకు 4 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8 కోట్ల మార్క్​ను దాటింది. మరణాలు 17.5 లక్షలకు చేరింది. అమెరికాలో రోజుకు లక్ష కేసుల వరకు వస్తుండగా, బ్రిటన్​, బ్రెజిల్​, ఫ్రాన్స్​, భారత్​, రష్యా వంటి దేశాల్లో 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

మొత్తం కేసులు: 80,207,155

మరణాలు: 1,757,640

కోలుకున్నవారు: 56,471,521

క్రియాశీల కేసులు: 21,977,994

  • అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజుకు దాదాపు లక్ష మందికిపైగా కొత్తగా వైరస్​ బారినపడుతున్నారు. శుక్రవారం 98 వేల మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 1.92 కోట్లు దాటగా.. 1.12 కోట్ల మంది కోలుకున్నారు.
  • అగ్రరాజ్యం తర్వాత యూకేలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 32,725 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసులు 22 లక్షలు దాటాయి. 70 వేల మంది మరణించారు.
  • రష్యాలో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 29వేలకుపైగా మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. ఇప్పటి వరకు 53 వేల మంది మరణించారు.
  • బ్రిటన్​ తర్వాత భారత్​, బ్రెజిల్​, ఫ్రాన్స్​, ఇటలీలలో 20 వేల వరకు కొత్త కేసులు వచ్చాయి. టర్కీ, జర్మనీ, కొలంబియా, మెక్సికో, ఉక్రెయిన్​, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో రోజుకు 10వేలకుపైగా కేసులు వస్తున్నాయి. ఉక్రెయిన్​, పెరూలు 10 లక్షల మార్క్​ను చేరుకున్నాయి. ఈ మైలురాయికి దక్షిణాఫ్రికా దగ్గరగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వివరాలు ఇలా..

దేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా 19,210,166 338,263
బ్రెజిల్ 7,448,560 190,515
రష్యా 2,992,706 53,659
ఫ్రాన్స్ 2,547,771 62,427
యూకే 2,221,312 70,195
టర్కీ 2,118,255 19,371
ఇటలీ 2,028,354 71,359
స్పెయిన్ 1,869,610 49,824

ABOUT THE AUTHOR

...view details