ప్రపంచవ్యాప్తంగా 8లక్షలకు చేరువలో మరణాలు - covid-19 news
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 2 లక్షల మందికి పైగా వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 2.26 కోట్లకు, మరణాలు 8 లక్షలకు చేరువయ్యాయి. అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.
కరోనా విలయం
By
Published : Aug 20, 2020, 10:36 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 8లక్షలకు చేరువైంది. రోజు రోజుకు కొత్త కేసుల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రోజుకు రెండు లక్షలకుపైగా కొత్తగా వైరస్ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2.26 కోట్లకు చేరువైంది. ఇదే సమయంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య కోటి53 లక్షలకు చేరటం కాస్త ఊరట కలిగిస్తోంది.
మొత్తం కేసులు: 22,579,095
మరణాలు: 791,002
కోలుకున్నవారు: 15,301,255
యాక్టివ్ కేసులు: 6,486,838
అమెరికాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం ఒక్కరోజు 43 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 57 లక్షలు దాటింది. మరణాలు 1.76 లక్షలకు చేరుకున్నాయి.
బ్రెజిల్లో వైరస్ విజృంభిస్తోంది. కేసులు, మరణాల పరంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1.11 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 34.60 లక్షల మంది వైరస్ బారినపడ్డారు.
వైరస్‌ను విజయవంతంగా కట్టడి చేయగలిగిన న్యూజిలాండ్‌లోనూ కొత్త కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం కొత్తగా 5 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్, సింగపూర్లలోనూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వివరాలు ఇలా..