తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా విజృంభణ: బ్రెజిల్​లో ఆందోళనకరంగా కేసులు - కరోనా వైరస్​ అమెరికా

ప్రపంచంపై కరోనా పంజా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 91,88,362కు చేరింది. మృతుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 4.74 లక్షల మంది వైరస్​ ధాటికి బలయ్యారు.

Worldwide corona virus cases
ప్రపంచంపై కరోనా పంజా.. బ్రెజిల్​లో ఆందోళనకరంగా కేసులు

By

Published : Jun 23, 2020, 10:15 AM IST

ప్రపంచదేశాలకు కరోనా వైరస్​ సవాళ్లు విసురుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 91,88,362 కేసులు నమోదయ్యాయి. 4,74,339 మంది వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

అత్యధికంగా అమెరికాలో 23 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. అయితే కేసుల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్​లో వైరస్​ విజృంభిస్తోంది. ఇప్పటివరకు 11 లక్ష 11వేల 348 మంది వైరస్​ బారినపడ్డారు. మృతుల సంఖ్య కూడా ఆందోళకరంగా ఉంది. 51 వేల 407 మంది వైరస్​కు బలయ్యారు.​

దేశం కేసులు మృతులు
అమెరికా 23,88,153 1,22,610
బ్రెజిల్​ 11,11,348 51,407
రష్యా 5,92,280 8,206
బ్రిటన్​ 3,05,289 42,647
స్పెయిన్​ 2,93,548 28,324
పెరూ 2,57,447 8,223
చిలీ 2,46,963 4,502
ఇటలీ 2,38,720 34,657
ఇరాన్​ 2,07,525 9,742

ABOUT THE AUTHOR

...view details