Worldwide corona update: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా వివిధ దేశాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఫ్రాన్స్‌లో కొత్తగా 2,19,126 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ కారణంగా మరో 110 మంది మరణించారు.
Us covid cases:అమెరికాలో కొత్తగా 1,61,398 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా.. 257 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 8.47లక్షలకు చేరింది.
Us colleges online classes:అమెరికాలో కరోనా బీభత్సం కొనసాగుతున్న వేళ... శీతాకాల సెలవులు ముగించుకుని విద్యార్థులు కళాశాలలకు తిరిగి వస్తున్నారు. అయితే.. కరోనా కారణంగా ఆ దేశంలోని అనేక యానివర్సిటీలు ప్రత్యక్ష బోధన వైపు కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ నెలలపాటు ఆన్లైన్లోనే పాఠాలు బోధించాలని భావిస్తున్నాయి.
కొత్త ఏడాదిలో మొదటి మూడు వారాలపాటు ఆన్లైన్లోనే తరగతులు నిర్వహిస్తామని అమెరికాలోని ప్రఖ్యాత హార్వార్డ్ విశ్వవిద్యాలయం తెలిపింది. జనవరి చివర్లో క్యాంపస్‌కు తిరిగి రావాలని విద్యార్థులకు చెప్పింది. షికాగో విశ్వవిద్యాలయం సైతం.. రెండు వారాలపాటు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని ప్రకటించింది. మిషిగాన్ స్టేట్ యూనివర్సిటీ సహా మరికొన్ని విద్యా సంస్థలు.. విద్యార్థులను క్యాంపస్‌కు తిరిగి ఆహ్వానించినప్పటికీ... ఆన్లైన్లోనే పాఠాలు ప్రారంభిస్తున్నాయి.
ఇదీ చూడండి:'ఫ్లొరోనా' పేరుతో కొత్త వ్యాధి- ఆ దేశంలో తొలి కేసు నమోదు
చైనాలో కరోనా కలకలం..
China corona cases: కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలోనూ.. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆ దేశంలో శనివారం కొత్తగా 131 స్థానికంగా వ్యాప్తి చెందిన కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చినవారి కారణంగా మరో 60 కేసులు వెలుగు చూశాయి. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య కమిషన్ తెలిపింది.
మరోవైపు.. కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు చేపడుతోంది. షియాన్ నగరంలో కొవిడ్ కేసులు బయటపడగా.. ఆ నగరంలో బుధవారం లాక్డౌన్ విధించింది. దీంతో 1.3 కోట్ల జనాభా ఉన్న ఆ నగరం.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉపాధి లేక, ఆహారం దొరకక ప్రజలు సతమతమవుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇలా..
ఇక ప్రపంచవ్యాప్తంగా 11,88,467 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ కారణంగా మరో 4,129 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 28,96,65,459కి చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 5,457,130కి చేరింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు ఇలా...
- బ్రిటన్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా లక్షా 62 వేల కేసులు నమోదయ్యాయి. 154 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
- ఇటలీలో 1.41 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 111 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 62,66,939 కు పెరిగింది. మరణాల సంఖ్య 1,37,513కు చేరుకుంది.
- టర్కీలో కొత్తగా 36 వేల కేసులు నమోదయ్యాయి. మరో 145 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
ఇదీ చూడండి:Omicron hospitalization: 'ఒమిక్రాన్‌తో ఆస్పత్రుల్లో చేరే ముప్పు తక్కువే'
ఇదీ చూడండి:లండన్‌లో కరోనా విలయం... 15 మందిలో ఒకరికి పాజిటివ్