కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య కోటి49 లక్షలు దాటింది. మరోవైపు మొత్తం మరణాల సంఖ్య 6 లక్షల 15 వేలకు చెేరింది. ఇప్పటివరకు 89 లక్షల 67 వేలకు పైగా బాధితులు కోలుకున్నారు.
అమెరికాను విలవిల..
అగ్రరాజ్యం అమెరికాను కరోనా ధాటికి విలవిలలాడుతోంది. ఇవాళ అక్కడ కొత్తగా 22,512 కేసులు, 420 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 39 లక్షల 83 వేలకు చేరగా.. మరణాలు లక్షా 44 వేలు దాటాయి.
ఉద్దీపన ప్యాకేజీ
కరోనా సంక్షోభం ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు యూకే మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం కూడా ఇదే దారిలో వెళుతోంది.
బ్రెజిల్లో కరోనా ఉద్ధృతి
బ్రెజిల్లో కొత్తగా 7,408 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. దీనితో మొత్తం కేసులు 21 లక్షల 29 వేలకు మించాయి. మరోవైపు 242మంది వైరస్ బారిన పడి మరణించారు. మొత్తం మరణాలు సంఖ్య 80,493కి చేరింది.