తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్​ పంజా- అమెరికా, బ్రెజిల్​లో తగ్గని తీవ్రత - కొవిడ్​-19

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 వేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికా, భారత్​, రష్యాలతో పాటు ఇతర దేశాల్లోనూ వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 90 లక్షలకు చేరువైంది. 9.24 లక్షల మంది మరణించారు. 2 కోట్ల 8 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకోవటం ఊరట కలిగిస్తోంది.

WORLD CASES
కొవిడ్​ పంజా-

By

Published : Sep 13, 2020, 9:12 AM IST

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా చుట్టేస్తోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 2.90 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. 5వేల మందికిపైగా మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 90 లక్షలకు చేరువైంది. అయితే.. ఇప్పటి వరకు 2 కోట్ల 8 లక్షలకుపైగా వైరస్​ నుంచి కోలుకోవటం ఊరట కలిగిస్తోంది. భారత్​, అమెరికా, బ్రెజిల్​, రష్యాలో వైరస్​ ఉద్ధృతి ఎక్కువగా ఉంది.

మొత్తం కేసులు: 28,940,197

మరణాలు: 924,569

కోలుకున్నవారు: 20,807,024

యాక్టివ్​ కేసులు: 7,208,604

  • అమెరికాలో కొద్ది రోజులుగా 30 వేల లోపు కేసులు నమోదవుతూ తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. మళ్లీ విజృంభిస్తోంది. శనివారం 40వేలకుపైగా కొత్తగా వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 66.76 లక్షల దాటింది. మరణాల సంఖ్య 2 లక్షలకు చేరువైంది.
  • బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం కొత్తగా 33,523 కేసులు నమోదయ్యాయి. 814 మంది వైరస్​కు బలయ్యారు. వారం రోజుల్లోనే 6వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాలు 1.31 లక్షలు దాటాయి.
  • రష్యాలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కేసుల పరంగా నాలుగో స్థానంలో ఉంది. మొత్తం కేసులు 10 లక్షలు దాటాయి. 18 వేలకుపైగా మరణించారు. 8.73 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • రష్యా తర్వాత ఐదో స్థానంలో ఉంది పెరూ. కేసులతో పాటు మరణాల సంఖ్యలోనూ పోటీ పడుతోంది. ఇప్పటి వరకు 7 లక్షలకుపైగా వైరస్​ బారినపడగా 30వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు ఇలా..

దేశం కేసులు మరణాలు
అమెరికా 6,676,601 198,128
బ్రెజిల్​ 4,315,858 131,274
రష్యా 1,057,362 18,484
పెరు 722,832 30,593
కొలంబియా 708,964 22,734
మెక్సికో 663,973 70,604

ABOUT THE AUTHOR

...view details