ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. తాజాగా ప్రపంచ దేశాల్లో కరోనా బాధితుల సంఖ్య 3 కోట్ల మార్కును దాటింది. మొత్తం మీద 3,00,30,839 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ దేశాల్లో కరోనాతో ఇప్పటివరకు 9 లక్షల 45 వేల మంది మృతి చెందారు. ప్రపంచంలో ఇప్పటివరకు కరోనా నుంచి 2 కోట్ల 17 లక్షల మంది కోలుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లు దాటిన కరోనా కేసులు - ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3 కోట్లను దాటింది. ఇప్పటివరకు 3,00,30,839 మంది కరోనా బారిన పడ్డారు. 9.45 లక్షలమంది మరణించారు. అమెరికాతో పాటు స్పెయిన్, ఫ్రాన్స్‌లో కేసులు భారీగా బయటపడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 3కోట్లు దాటిన కరోనా కేసులు
ప్రపంచ దేశాల్లో ఇదీ పరిస్థితి...
- అమెరికాలో కొత్తగా 36 వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. 1023 మంది మృతిచెందారు. అగ్రరాజ్యంలో మొత్తం 68 లక్షల 28 వేల మంది కరోనా బాధితులున్నారు. కరోనా సోకి 2 లక్షలకు పైగామంది మరణించారు.
- బ్రెజిల్‌లో 34,784, రష్యాలో 5,670 మందికి కొత్తగా కరోనా నిర్ధరణ అయ్యింది.
- పెరూలో మొత్తం 7 లక్షల 38 వేల మంది కరోనా బరినపడ్డారు.
- కొలంబియాలో ఇప్పటివరకు 7 లక్షల 28 వేల మంది కరోనా బాధితులు ఉన్నారు.
- మెక్సికోలో 6 లక్షల 76 వేల మందికి కరోనా సోకింది.
- మరణాల రేటులో ప్రపంచంలో మెక్సికో నాలుగో స్థానం ఉంది.
- దక్షిణాఫ్రికాలో 6 లక్షల 53 వేల మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
- స్పెయిన్‌లో కొత్తగా 11 వేలకుపైగా కేసులు నమోదవగా ఫ్రాన్స్‌లోనూ కొత్త కేసులు బయటపడుతున్నాయి.
ఇదీ చూడండి:-వ్యాక్సిన్ వలంటీర్ అస్వస్థతపై ఆక్స్ఫర్డ్ వివరణ