worldwide covid cases: కరోనా.. ముడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. రూపాలు మారుస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తూ లక్షల మందిని బలితీసుకుంటోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృభణతో దాదాపు అన్ని దేశాల్లో వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 24,97,154 మందికి వైరస్ సోకింది. 6,834 మంది బలయ్యారు. 6.89 లక్షల మంది వైరస్‌ను జయించారు. మొత్తం మరణాల సంఖ్య 54,89,506కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు కేసులు.. ఒక్కరోజే 25లక్షల మందికి కరోనా - అమెరికా కేసులు
worldwide covid cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మొత్తం బాధితుల సంఖ్య 30 కోట్లు దాటింది. గురువారం ఒక్కరోజే దాదాపు 25 లక్షల కేసులు వచ్చాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, భారత్, అర్జెంటీనా వంటి దేశాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న దేశాలు ఇలా..
- అమెరికాలో వైరస్ విలయం కొనసాగుతోంది. గురువారం మరో 7,51,512 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 2,143 మంది చనిపోయారు. 89వేల మంది వైరస్‌ను జయించారు. మొత్తం కేసుల సంఖ్య 59,564,116కు, మరణాలు 8,55,843కు చేరాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులే 95 శాతం మేర ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త కేసులతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం లక్షకుపైగా చికిత్సపొందుతున్నట్లు అంచనా.
- ఫ్రాన్‌లో ఒమిక్రాన్ సహా మరో కొత్త వేరియంట్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. డెల్టా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 2,61,481 కేసులు బయటపడ్డాయి. 204 మంది మరణించారు. 57వేల మంది వైరస్‌ను జయించగా.. మొత్త కేసులు 11,183,238, మరణాలు 1,25,013కు చేరాయి.
- ఇటలీలో గురువారం కొత్తగా 2.19 లక్షల కేసులు వచ్చాయి. 198 మంది ప్రాణాలు కోల్పోయారు. 46వేల మంది వైరస్ నుంచి కోలుకోగా.. మొత్తం కేసుల సంఖ్య 69, 75,465కు చేరింది. మొత్తం 1,14, 207 మంది మరణించారు.
- బ్రిటన్‌లోనూ కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం 1,79,756 మందికి వైరస్ సోకింది. 231 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1.40 లక్షలు దాటింది.
- అర్జెంటీనాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 1,09,608 కేసులు బయటపడ్డాయి. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 36వేల మంది కోలుకోగా.. మొత్తం కేసుల సంఖ్య 6,025,303కు చేరింది.
ఇదీ చూడండి: