తెలంగాణ

telangana

ETV Bharat / international

కుబేరుల 'రోదసి' పోరులో.. విశేషాలెన్నో! - blue origin

ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ మంగళవారం అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. బ్రిటన్​ కుబేరుడు రిచర్డ్​ బ్రాన్సన్​ ఇప్పటికే యాత్ర ముగించేశారు. ఈ నేపథ్యంలో వీరి యాత్రలకు సంబంధించిన విశేషాలు చూద్దాం..

bezos, richard
జెఫ్ బెజోస్, స్పేస్ టూర్

By

Published : Jul 20, 2021, 8:02 PM IST

కుబేరుల 'రోదసి' పోరులో మరో ఘట్టం ముగిసింది. అమెజాన్​ వ్యవస్థాపకుడు చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. బెజోస్​తో పాటు.. మొత్తం నలుగురు సభ్యుల బృందం అంతరిక్ష యాత్రను చేపట్టి తిరిగి భూమికి చేరుకుంది.

బ్రిటన్​ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్.. 9 రోజుల ముందే.. అంటే జులై 11న.. రోదసి యాత్రను చేపట్టి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఇరువురి యాత్రకు సంబంధించిన విశేషాలను ఓసారి చూద్దాం..
బెజోస్​ వర్సెస్​ రిచర్డ్​..

క్షేమంగా భూమిపైకి చేరిన బెజోస్ బృందం
బెజోస్ యాత్ర విజయవంతం

రిచర్డ్​ బృందం రోదసిలో 15 నిమిషాలు గడపగా.. బెజోస్​ బృందం 11 నిమిషాలు గడిపింది.

రోదసిలో బెజోస్ బృందం
రిచర్డ్ బృందం

బ్లూ ఆరిజిన్ చేపట్టిన రోదసి యాత్రకు మరో ముగ్గురితో కలిసి 'న్యూ షెపర్డ్‌' వ్యోమనౌక ద్వారా పయనించారు జెఫ్ బెజోస్. విశ్వంలోకి వెళ్లిన అతిపెద్ద, పిన్న వయస్కులు ఈ యాత్రలో ఉండటం విశేషం.

బెజోస్ బృందం

రిచర్డ్.. ఆరుగురు సభ్యుల బృందంతో రోదసి యాత్ర చేపట్టారు.

రిచర్డ్ బృందం

పశ్చిమ టెక్సాస్‌ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్‌ సైట్‌ వన్‌ నుంచి సాయంత్రం 6:30 గంటలకు(భారత కాలమానం ప్రకారం) న్యూ షెపర్డ్‌ దూసుకెళ్లింది.

స్పేస్ టూర్​కు సిద్ధమైన న్యూ షెపర్డ్
నింగిలోకి దూసుకెళ్తున్న బ్లూ ఆరిజిన్ వ్యోమనౌక

జులై 11న సాయంత్రం 6.30 గంటలకు వర్జిన్​ గెలాక్టిక్ వ్యోమనౌక యూనిటీ 22 లాంచ్​ ఉంటుందని తొలుత సంస్థ పేర్కొంది. అయితే.. వాతావరణ పరిస్థితుల వల్ల గంటన్నర ఆలస్యంగా రిచర్డ్​ బృందం రోదసి యాత్ర చేపట్టింది.

రోదసిలోకి వెళ్లిన రిచర్డ్ బ్రాన్సన్ బృందం

నిజానికి రోదసియానం చేసే ఉద్దేశం వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్​కు లేదు. బెజోస్‌ తన యాత్ర గురించి ప్రకటన చేయగానే బ్రాన్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార ప్రత్యర్థి కన్నా ముందుండేందుకు ఈ నెల 11న యాత్ర చేపట్టారు. తద్వారా.. స్వీయ వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లొచ్చిన తొలి బిలియనీరుగా ఆయన గుర్తింపు పొందారు.

ఇదీ చదవండి:బెజోస్​ బృందం గర్వపడుతున్న విషయం ఇదే!

ABOUT THE AUTHOR

...view details