తెలంగాణ

telangana

ETV Bharat / international

రూ. కోట్లు పలికిన 250ఏళ్ల నాటి విస్కీ బాటిల్​!

ఓ విస్కీ బాటిల్ ధర కోటి రూపాయలు అంటే నమ్మగలరా? ధర చూసి తాగకుండానే కిక్కు ఎక్కిందంటారా?. ఓ సంస్థ నిర్వహించిన వేలంలో 250 ఏళ్లనాటి విస్కీ అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించింది.

whisky
ఖరీదైన విస్కీ బాటిల్.. ధర@'కోటి' రూపాయలు మాత్రమే!

By

Published : Jul 18, 2021, 10:54 AM IST

Updated : Jul 18, 2021, 4:42 PM IST

అది ప్రపంచంలోనే పురాతన విస్కీ బాటిల్​. 1850లో తయారైంది . ఇక అందులో నింపిన విస్కీ అంతకంటే ఒక పది సంవత్సరాల ముందుది.! ఆనాటి బాటిల్ నేడు వేలానికి వచ్చింది. అనుకున్నదానికన్నా ఆరు రెట్లు అధిక ధర పలికింది. సుమారు కోటి రూపాయలకు అమ్ముడైన ఈ బాటిల్ కథ మీకోసం..

లండన్​లో నిర్వహించిన వేలం పాటలో ఏకంగా రూ.కోటి ధర పలికిన ఈ విస్కీ.. ప్రముఖ ఆర్థికవేత్త జేపీ.మోర్గాన్​కు చెందినదని వేలం నిర్వాహకులు తెలిపారు. ఆయన గదిలో దొరికిన మూడు సీసాల్లో మిగిలి ఉన్న ఏకైక బాటిల్ ఇదే కావడం విశేషం. బాటిల్ వెనుక ఉన్న లేబుల్​ను బట్టి ఇది 1865కి ముందే తయారైనట్లు నిపుణులు చెబుతున్నారు. స్కిన్నర్ ఇంక్ అనే సంస్థ నిర్వహించిన వేలంలో అధిక ధరకు అమ్ముడై.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సృష్టించింది ఈ విస్కీ బాటిల్​.

మొదట ఈ బాటిల్​కు 20-40 వేల డాలర్ల మధ్య ధర లభిస్తుందని వేలం నిర్వహించిన 'స్కిన్నర్ ఇంక్' అంచనా వేసింది. జూన్ 30న ముగిసిన వేలంలో అమెరికా మాన్​హట్టన్​లోని 'ది మోర్గాన్ లైబ్రరీ' అనూహ్యంగా 1,37,500 డాలర్లు (రూ.కోటి)కు దక్కించుకుంది.

తాగేస్తారా?

విస్కీ సుమారు 10 సంవత్సరాల వరకే నిల్వ ఉంటుందని.. దాదాపు రెండున్నర శతాబ్దాల నాటి ఈ విస్కీ ఇప్పుడు తాగేందుకు అవకాశం లేదని వేలంలో బాటిల్​ను దక్కించుకున్న సంస్థ ప్రతినిధులు తెలిపారు. 1900లో జార్జియా పర్యటన సందర్భంగా జేపీ మోర్గాన్ ఈ బాటిల్​ను కొన్నాడు. అనంతరం తన కొడుకుల నుంచి.. 1942-44 మధ్య దక్షిణ కరోలినా గవర్నర్ జేమ్స్ బైర్నెస్‌కు చేరింది. అక్కడి నుంచి చేతులు మారుతూ.. 'మోర్గాన్ లైబ్రరీ'కే వచ్చి చేరింది.

1770లలో సంభవించిన విప్లవాత్మక మార్పులు, యుద్ధ పరిస్థితుల్లో విస్కీని తయారు చేయడం మొదలుపెట్టారని ప్రతీతి.

ఇదీ చదవండి:

ప్రపంచంలోనే ఖరీదైన 'విస్కీ'..ధరెంతో తెలుసా?

Last Updated : Jul 18, 2021, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details