కరిబీయన్ దీవులలోని డొమినికాలో భారీ పాము కనిపించింది. అది ఎంత భారీ పాము (World's Biggest Snake) అంటే.. దాన్ని పైకి లేపడానికి ఏకంగా క్రేన్‌నే ఉపయోగించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
దట్టమైన పొదల్లో పామును గుర్తించి.. బయటకు తీశారు. క్రేన్‌తో పామును పైకి తీసినప్పుడు.. దాని తల భాగం భూమి వరకు ఉండటం చూసి ప్రత్యక్షంగా చూసినవారు ఆశ్చర్యపోయారు.
ఇది కరీబియన్ ఐలాండ్‌కు చెందిన ప్రత్యేక జాతి పాము అని తెలుస్తోంది. ఇవి సాధారణంగా 13 అడుగుల పొడవు పెరుగుతాయి. కానీ వీడియోలో పాము మాత్రం అంతకన్నా పెద్దగా ఉండటాన్ని చూడొచ్చు.