తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 3.61 కోట్లు దాటిన కరోనా కేసులు - Mexico Corona cases

ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 3కోట్ల 61లక్షల మంది కొవిడ్​ బారినపడ్డారు. వీరిలో 10లక్షల 55వేల మందికిపైగా మరణించారు. అయితే.. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా రికవరీల సంఖ్యలోనూ గణనీయమైన వృద్ధి కనిపించడం ఊరటనిస్తోంది.

WORLD WIDE CORONAVIRUS CASES CROSSED TO 3.61 CRORES
ప్రపంచ వ్యాప్తంగా 3.61 కోట్లు దాటిన కరోనా కేసులు

By

Published : Oct 7, 2020, 8:19 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ విలయతాండవం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు 3.61 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 10.55 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ బారినపడిన వారిలో 2.71 కోట్ల మంది కోలుకున్నారు. మరో 78.74 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

  • కొవిడ్​ కేసులు, మృతుల పరంగా తొలిస్థానంలో అమెరికా ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు 77.26 లక్షల వైరస్​ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2లక్షల 15వేల మందికిపైగా మరణించారు.
  • రష్యాలో కొత్తగా 11,115 కరోనా కేసులు వెలుగుచూడగా.. బాధితుల సంఖ్య 12,48,619కు పెరిగింది. వైరస్​ ధాటికి మరో 202 మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 21,865కు చేరింది.
  • మెక్సికోలో మరో 4,828 మందికి కొవిడ్​ నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 7,94,608కి పెరిగింది. మరో 471 మంది కరోనా కారణంగా మృతిచెందారు. దీంతో మరణాల సంఖ్య 82,348కి చేరింది.
  • పాక్​లో బుధవారం 624 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా బాధితుల సంఖ్య 3,16,351కి చేరింది. ఇప్పటివరకు అక్కడ 6,535 మంది వైరస్​కు బలయ్యారు.
  • నేపాల్​పై కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా 3,439 మందికి వైరస్​ ఉన్నట్టు తేలింది. దీంతో కేసుల సంఖ్య 94,253కు పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details