ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ 2 కోట్ల 77 లక్షల 84 వేల మందికిపైగా మహమ్మారి సోకింది. మరో 9 లక్షల 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కోటీ 98 లక్షల 79 వేల మంది కోలుకున్నారు.
- కొవిడ్ కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 65.14 లక్షల మందికి వైరస్ సోకింది. 1.94 లక్షల మంది మృతి చెందారు.
- బ్రెజిల్లో ఇప్పటివరకు 43.82 లక్షల కేసులు నమోదయ్యాయి. మరో 74వేల మందికిపైగా మహమ్మారి ధాటికి బలయ్యారు.
- రష్యాలో తాజాగా 5,218 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 10,41,007కు చేరింది. మరో 18,135 మంది కరోనా వల్ల మరణించారు.
- మెక్సికోలో కొత్తగా 5,351 కేసులు వెలుగుచూడగా.. బాధితుల సంఖ్య 6,42,860కు ఎగబాకింది. మరో 703 మరణాలతో.. చనిపోయిన వారి సంఖ్య 68,484కు పెరిగింది.
- పాక్‌లో కొత్తగా 426 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు ఆ దేశంలో 6,359 మంది వైరస్‌తో మృతిచెందారు.
- పొరుగు దేశం నేపాల్‌లో కరోనా కేసుల సంఖ్య 50వేలకు చేరువైంది. తాజాగా 1,081 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 312 మంది కొవిడ్ కారణంగా మృత్యువాతపడ్డారు.
- సింగపుర్‌లో మరో 75 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 57,166కు చేరింది. ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు.