World War 2 Letter Delivery: అమెరికాలో జరిగిన ఈ యథార్థ సంఘటన వింటే ఎవరికైనా శివమణి సినిమాలో ఉత్తరం సీన్ గుర్తురావాల్సిందే..! ఎప్పుడో 76 ఏళ్ల క్రితం ఓ సైనికుడు తన తల్లి యోగక్షేమాలను అడుగుతూ పంపించిన ఉత్తరం.. ఇటీవల చేరాల్సిన చోటుకు చేరింది. కానీ రాసినవారు, తీసుకోవాల్సినవారు ఇద్దరూ లేరు.
ఏం జరిగిందంటే..?
1945 డిసెంబర్.. అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులవి. ఆ సమయంలో అమెరికాకు చెందిన ఆర్మీ ఎస్జీటీ జాన్ గోన్సల్వేస్(అప్పటి వయసు 22) జర్మనీలో ఉండేవారు. మసాచుసెట్స్ రాష్ట్రం వోబర్న్లో ఉండే తన తల్లికి యోగక్షేమాలను అడుగుతూ లేఖ రాశారు.
" డియర్ మామ్. ఈరోజు నీ నుంచి మరొక లేఖ నా వద్దకు వచ్చింది. అంతా బాగానే ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. నేను బాగానే ఉన్నాను. లవ్ అండ్ కిస్సెస్. మీ జానీ. త్వరలోనే నేను నిన్ను చూస్తాను అని అనుకుంటున్నా."
-- ఉత్తరంలోని మాటలు