ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది నర్సుల కొరత ఉందని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ, వైద్య వ్యవస్థపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతున్న వేళ ఈ ఆందోళనకర వాస్తవాలను బయటపెట్టింది.
'ఆరోగ్య రంగానికి నర్సులు వెన్నెముక లాంటి వారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 28 మిలియన్ల మంది నర్సులు మాత్రమే ఉన్నప్పటికీ... వీరు ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి 2018 వరకు వీరి సంఖ్య 4.7 మిలియన్లు పెరిగింది. అయినప్పటికీ 5.9 మిలియన్ల మంది నర్సుల కొరత ఉంది' అని అన్నారు డబ్ల్యూహెచ్ఓ అధినేత టెడ్రోస్.