కరోనా.. తీవ్ర భయాందోళనలను, ఒంటరితనాన్ని, మరణ ముప్పును మోసుకొచ్చినా, ప్రజల ఆనందం తరగలేదు! మహమ్మారి వెన్నులో వణుకు పుట్టించినా, తరగని సంతోషాన్ని సొంతం చేసుకుంది.. ఫిన్లాండ్! ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. శనివారం అంతర్జాతీయ ఆనంద దినోత్సవం కావడంతో.. 'ప్రపంచ ఆనంద నివేదిక-2021'ను ఐరాస విడుదల చేసింది. భారత్ మాత్రం మొత్తం పరిగణనలోకి తీసుకున్న 149 దేశాల జాబితాలో 139వ స్థానంతో సరిపెట్టుకుంది.
గత మూడు సంవత్సరాల మాదిరే ఈసారి కూడా ఫిన్లాండ్ తన రికార్డును పదిలం చేసుకొంది. ఆ తర్వాతి స్థానాలను వరుసగా ఐస్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లు దక్కించుకున్నాయి. గత ఏడాది 18వ స్థానంలో ఉన్న అమెరికా ఈసారి 14వ స్థానానికి ఎగబాకింది. 2012 నుంచి ఐరాసకు చెందిన 'సస్టెయిన బుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్' ఏటా ప్రపంచ ఆనంద నివేదికను వెల్లడిస్తూ వస్తోంది.
టాప్-20లోకి చైనా..