తెలంగాణ

telangana

అమెరికాలో 60 లక్షలు దాటిన కరోనా కేసులు

By

Published : Aug 28, 2020, 8:53 AM IST

ప్రపంచ దేశాల్లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 46లక్షల 62 వేలు దాటింది. ఇప్పటివరకు 8లక్షల 35వేల మందికిపైగా వైరస్​ ధాటికి బలయ్యారు. అమెరికా, బ్రెజిల్​, రష్యా దేశాల్లో ​అధికంగా కేసులు నమోదవుతున్నాయి.

world covid19 tracer
కరోనా పంజా.. అమెరికా 60 లక్షలు దాటిన కేసులు

ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 2కోట్ల 46లక్షల 22వేల 014కు చేరింది. మహమ్మారి వల్ల 8లక్షల 35వేల 530మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు కోటి 70లక్షల మందికి పైగా వ్యాధి నుంచి కోలుకున్నారు.

  • అమెరికాలో రోజురోజుకు కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. 60.46 లక్షల మంది వైరస్​ బారినపడగా.. 33.47లక్షల మంది కోలుకున్నారు. 1.84లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి తగ్గడం లేదు. 37.64లక్షల మందికి వైరస్​ సోకింది. లక్షా 18వేలకుపైగా వైరస్​కు బలయ్యారు. ఇప్పటి వరకు 29.47లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • రష్యాలో తాజగా 4,711 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 121 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 9,75,576కు, మరణాల సంఖ్య 16,804కు చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 7,92,561 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • పెరూ​లో కొత్తగా 8,619 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,21,997కు చేరింది. 153 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 28,277కు చేరింది. 4,29,662 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

ప్రపంచ దేశాల్లో కేసుల వివరాలు ఇలా..

దేశం కేసులు మరణాలు
అమెరికా 6,046,634 184,796
బ్రెజిల్​ 3,764,493 118,726
రష్యా 975,576 16,804
పెరూ 621,997 28,277
దక్షిణాఫ్రికా 618,286 13,628
కొలంబియా 582,022 18,468
మెక్సికో 573,888 62,076

ABOUT THE AUTHOR

...view details