తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2.12లక్షల కరోనా కేసులు - us corona cases

ప్రపంచదేశాల్లో కరోనావైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 2.12 లక్షల కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య రెండు కోట్ల 18 లక్షలు దాటింది. మొత్తం మృతుల సంఖ్య 7.73 లక్షలకు చేరువైంది. అమెరికా, బ్రెజిల్​లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.

world covid tracer
కరోనా పంజా... దక్షిణ ఆఫ్రికాలో 6 లక్షలకు చేరువలో కేసులు

By

Published : Aug 17, 2020, 8:13 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్​, రష్యా, సౌతాఫ్రికాలో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది..

అమెరికాలో..

అమెరికాలో కరోనాకు అడ్డుకట్ట పడటం లేదు.. తాజాగా మరో 36,843 మందికి వైరస్​ సోకగా, మొత్తం 55,66,632 మంది కరోనా బారినపడ్డారు. లక్షా 73 వేల మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 522 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

బ్రెజిల్​లో...

బ్రెజిల్​లో కరోనా కేసులు నానాటికి పెరుగుతున్నాయి. తాజాగా 22,365 మంది కరోనా బారిన పడ్డట్లు అధికారులు తెలిపారు.. మొత్తం కేసుల సంఖ్య 33 లక్షల 40 వేలకు చేరింది. మరో 522 మంది కొవిడ్​తో మృతి చెందగా.. మరణాల సంఖ్య 1,07,879కు చేరింది.

రష్యాలో...

రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య స్థిరంగా ఉండటం.. రష్యాకు సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. కొత్తగా 4,969 మందికి కరోనా సోకినట్లు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 22 వేలకు చేరింది. వీరిలో 7.32 లక్షల మంది కోలుకున్నారు. మరో 68 మంది మృతి చెందడం వల్ల మరణాల సంఖ్య 15,685కు పెరిగింది.

  • మెక్సికోలో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 5.17 లక్షల మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 635 మంది మృతి చెందగా.. దాదాపు 56 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 3,692 కేసులు గుర్తించారు. 162 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 5,87,345కు ఎగబాకింది. మొత్తం 11,839 మంది ప్రాణాలు విడిచారు.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశం కేసులు మరణాలు
అమెరికా 55,66,632 1,73,128
బ్రెజిల్ 33,40,197 107,879
రష్యా 922,853 15,685
దక్షిణాఫ్రికా 587,345 11,839
మెక్సికో 517,714 56,543
పెరూ 535,946 26,281

ABOUT THE AUTHOR

...view details