ప్రపంచంపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 2కోట్ల 36లక్షలకు చేరువైంది. 8.12 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో కోటి 60లక్షల మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు.
- అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. మొత్తం 58.74 లక్షల మంది వైరస్ బారినపడగా.. 1.80లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 31.67లక్షల మంది కోలుకున్నారు.
- బ్రెజిల్లో వైరస్ ఉద్ధృతి తగ్గడం లేదు. 36.05లక్షల మందికి వైరస్ సోకింది. లక్షా 14వేలకుపైగా వైరస్‌కు బలయ్యారు. ఇప్పటి వరకు 27.09లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- రష్యాలో కొత్తగా 4,852 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 73 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 9,56,749కు, మరణాలు 16,383కి చేరాయి. అయితే.. 7.70 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
- మెక్సికోలో తాజాగా 6,482 కేసులు వెలుగుచూశాయి. 644 మంది మంది ప్రాణాలు కోల్పోయారు.. మొత్తం 5,56,216 మంది బాధితులు ఉన్నారు. ఫలితంగా మరణాలు 60,254కు చేరాయి. .. 3.80 లక్షల మందికి వైరస్ నయమైంది.
- కొలంబియాలో తాజాగా నమోదైన కేసులతో కలిపి బాధితుల సంఖ్య 5,41,147కు చేరింది. దేశవ్యాప్తంగా 16,383 మంది ప్రాణాలు కోల్పోయారు.