తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నర మందికి కరోనా నయం - corona latest news

ప్రపంచదేశాల్లో కరోనావైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 2.53 లక్షల కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య రెండు కోట్ల 23 లక్షలు దాటింది. మొత్తం మృతుల సంఖ్య 7.84 లక్షలు దాటింది. ఇప్పటి వరకు కోటిన్నర మంది వైరస్ నుంచి కోలుకోవటం కొంత ఊరటనిచ్చే అంశం. అమెరికా, బ్రెజిల్​లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.

world covid-19 tracer
ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నర మందికి కరోనా నయం

By

Published : Aug 19, 2020, 8:20 AM IST

Updated : Aug 19, 2020, 9:22 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్​, రష్యా, సౌతాఫ్రికాలో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది..

అమెరికాలో..

అమెరికాలో కరోనా పంజా విసురుతూనే ఉంది.. తాజాగా మరో 44 వేల మందికి వైరస్​ సోకగా.. మొత్తం 56,55,974 మంది కరోనా బారినపడ్డారు. లక్షా 75 వేల మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 1,358 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

బ్రెజిల్​లో...

బ్రెజిల్​లో కరోనా కేసులు రోజు రోజుకు ఉద్ధృతమవుతున్నాయి. తాజాగా 48,637 మంది కరోనా బారిన పడ్డట్లు అధికారులు తెలిపారు.. మొత్తం కేసుల సంఖ్య 34 లక్షల 11 వేలకు చేరింది. మరో 1,365 మంది కొవిడ్​తో మృతి చెందగా.. మరణాల సంఖ్య 1,10,,019కి చేరింది.

రష్యాలో...

రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య స్థిరంగా ఉండటం.. రష్యాకు సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. కొత్తగా 4,748 మందికి కరోనా సోకినట్లు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 32 వేలకు చేరింది. వీరిలో 7.42 లక్షల మంది కోలుకున్నారు. మరో 132 మంది మృతి చెందడం వల్ల మరణాల సంఖ్య 15,872కు పెరిగింది.

  • మెక్సికోలో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 5.25 లక్షల మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 266 మంది మృతి చెందగా.. 57 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 2,258 కేసులను గుర్తించారు. 282 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 5,92,144కు ఎగబాకింది. మొత్తం 12,264 మంది ప్రాణాలు విడిచారు.
  • పెరూలోనూ తాజాగా 7,828 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో మొత్తం 5,49,321 మంద వైరస్ బారినపడ్డారు. వీరిలో 3.74 లక్షల మంది కోలుకున్నారు.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశం కేసులు మరణాలు
అమెరికా 56,55,974 1,75,074
బ్రెజిల్ 34,11,872 1,10,019
రష్యా 9,32,493 15,872
దక్షిణాఫ్రికా 592,144 12,264
మెక్సికో 525,733 57,023
పెరూ 549,321 26,658
Last Updated : Aug 19, 2020, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details