ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజువారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండగా వివిధ దేశాలు అల్లాడిపోతున్నాయి. అమెరికాలో శుక్రవారం ఒక్కరోజే.. 99,740 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి లాక్డౌన్ విధించాల్సిందిగా అక్కడి గవర్నర్లపై స్థానికులు ఒత్తిడి తెస్తున్నారు.
అమెరికాలో కరోనా ఉగ్రరూపం- ఒక్కరోజే లక్ష కేసులు - delta variant in america
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతంగా కొనసాగుతోంది. అమెరికాలో ఒక్కరోజే 99వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి ప్రపంచంలో మొత్తం బాధితుల సంఖ్య 19 కోట్ల 79లక్షలు దాటింది.
ప్రపంచంలో కరోనా కేసులు
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 6,43,006 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 9,360 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,79,67,763కు చేరగా.. మరణాల సంఖ్య 42,23,498కి పెరిగింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అధికభాగం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవవే కావడం ఆందోళన కల్గిస్తోంది.
దేశం | కొత్త కేసులు |
అమెరికా | 99,740 |
బ్రెజిల్ | 40,904 |
ఫ్రాన్స్ | 24,309 |
బ్రిటన్ | 29,662 |
రష్యా | 23,564 |
టర్కీ | 22,083 |
స్పెయిన్ | 24,753 |
ఇవీ చూడండి: