తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా విలయం: కోటి 47 లక్షలు దాటిన కేసులు - ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొత్తం కొవిడ్ కేసులు కోటి 47 లక్షలు దాటగా.. మృతుల సంఖ్య 6 లక్షల 10 వేలకుపైగా పెరిగాయి. అమెరికా, రష్యా, భారత్, బ్రెజిల్​లు కరోనాతో అతలాకుతలం అవుతున్నాయి. చైనాలోనూ కొవిడ్ మహమ్మారి మరో విడత విజృంభణ ప్రారంభించింది.

world corona death toll
ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులోనే లక్ష కరోనా కేసులు

By

Published : Jul 20, 2020, 10:44 PM IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా లక్షా 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య కోటి 47 లక్షలు దాటింది. మరోవైపు మొత్తం మరణాల సంఖ్య 6 లక్షల 10 వేలు దాటింది. 87 లక్షల 90 వేలకు పైగా బాధితులు కోలుకున్నారు.

కరోనా విలయం: కోటి 47 లక్షలకుపైగా పెరిగిన కేసులు

అమెరికాను కబలిస్తున్న కరోనా

కరోనా అగ్రరాజ్యం అమెరికాను కబలిస్తోంది. ఇవాళ అక్కడ కొత్తగా 20,759 కేసులు, 153 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 39 లక్షల 19 వేలకుపైగా, మరణాలు లక్షా 43 వేలకుపైగా నమోదయ్యాయి.

రష్యాలో కరోనా ఉద్ధృతి

రష్యాలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా అక్కడ 5,940 పాజిటివ్ కేసులు, 85 మరణాలు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 77 వేలకు, మరణాల సంఖ్య 12 వేలకు పెరిగింది.

బ్రెజిల్​లో కొవిడ్ కలవరం

బ్రెజిల్​లో కొత్తగా 2,663 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. దీనితో మొత్తం కేసులు 21 లక్షలు మించాయి. మరోవైపు కొత్తగా 57 మంది వైరస్​ బారిన పడి మరణించారు. దీనితో మొత్తం మరణాలు సంఖ్య 79,590కి చేరింది.

చైనాలో కొవిడ్ తిరగమోత

చైనా వాయువ్య నగరం ఉరుంకిలో కరోనా కేసులు మరోసారి పెరిగిపోతున్నాయి. సోమవారం ఈ ఒక్క నగరంలోనే కొత్తగా 17 కేసులు బయటపడగా.. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్​ కేసులు 47 నమోదయ్యాయి. విదేశాల నుంచి చైనా వచ్చిన మరో ఐదుగురికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.

నేపాల్​లో..

నేపాల్​లో ఇవాళ కొత్తగా 186 కొవిడ్ కేసులు నమోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య 17,844కి చేరింది. మరో 40 మంది వైరస్ బారిన పడి మృతిచెందారు.

ఇదీ చూడండి:కరోనా టీకా అధ్యయన ఫలితాలను వెల్లడించిన ఆక్స్‌ఫర్డ్‌

ABOUT THE AUTHOR

...view details