ప్రపంచంపై కరోనా పంజా విసురుతోంది. కొత్తగా 35,480మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులో 2,406మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 18,48,351కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 58,352 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికాలో..
వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైన అమెరికాలో కొత్తగా 178మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. 3,995 మందికి కొత్తగా కరోనా సోకింది. 7,66,153కిపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 15,097మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఐరోపాలో..
ఐరోపాలో వైరస్ కారణంగా 1,20,140మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ దేశాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. 13లక్షల 44వేలకు పైగా వైరస్ బారినపడ్డారు.
అమెరికా, ఇటలీ తర్వాత కరోనాతో అత్యంత ప్రభావితమైన స్పెయిన్‌లో మరో 378మంది ప్రాణాలు కోల్పోయారు. గత నాలుగు వారాల్లో ఇదే అత్యల్పమని వెల్లడించారు అధికారులు.