తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచ బ్యాంకులో కీలక పదవికి బంగ్లాదేశీయుడు- చరిత్రలో రెండోసారి

MIGA NEW VICE PRESIDENT: ప్రపంచ​ బ్యాంకు ఆపరేషన్స్​ వైస్​ ప్రెసిడెంట్​గా ఆ సంస్థ భారత ముఖ్య అధికారి​ కమల్ అహ్మద్​.. బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏప్రిల్​ 16వ తేదీ నుంచి ఆయన సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

By

Published : Feb 26, 2022, 1:11 PM IST

జునైడ్​ కమల్​ అహ్మద్​
junaid kamal ahmad

MIGA NEW VICE PRESIDENT: ప్రపంచ బ్యాంకు భారత​ ముఖ్య అధికారి జునైద్‌ కమల్‌ అహ్మద్‌.. ఆ సంస్థ ఆపరేషన్స్ వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఆపరేషన్స్ మల్టీలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారెంటీ ఏజెన్సీకి(MIGA) వైస్​ప్రెసిడెంట్​గా బాధ్యతలు స్వీకరించబోతున్న అహ్మద్, చరిత్రలోనే ఇంత ఉన్నత స్థాయికి ఎదిగిన రెండో బంగ్లాదేశ్ జాతీయుడు కావడం విశేషం.

"భారత్‌తో ప్రపంచ బ్యాంక్​కు ఉన్న భాగస్వామ్యం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నేర్చుకునేందుకు వీలు కల్పిస్తోంది. 2016 నుంచి భారతదేశ ప్రతినిధిగా పని చేస్తున్న అనుభవం నా జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆ అనుభవమే నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొవాలంటే డబ్బు చాలా అవసరం " అని జునైద్​ కమల్​ అహ్మద్​ చెప్పారు.

ఏప్రిల్​ 16వ తేదీ నుంచి అహ్మద్​ బాధ్యతలను స్వీకరిస్తారని బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రపంచ బ్యాంకు గ్రూప్​లో ఉన్న ఆర్థిక సంస్థలు, పెట్టుబడిదారులతో MIGA భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి అహ్మద్​ కృషి చేయాలని చెప్పారు. అహ్మద్​కు లోతైన అనుభవం, ఆలోచనా శక్తితో కూడిన నాయకత్వం వంటి లక్షణాలు ఉండడం వల్ల ఈ పదవికి ఎంపిక చేశామని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 11వేల 499 నమోదు

ABOUT THE AUTHOR

...view details