తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇస్రో.. నీ ప్రయాణం స్ఫూర్తిదాయకం: నాసా - ల్యాండర్​ విక్రమ్​

చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్​ ల్యాండర్​ను దింపేందుకు ప్రయత్నించిన ఇస్రోపై ప్రపంచదేశాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. చంద్రయాన్​-2 మిషన్​లో సమస్య తలెత్తినప్పటికీ... భారత శాస్త్రవేత్తలకు విశేష మద్దతు లభిస్తోంది. ఇస్రో ప్రయాణం నుంచి స్ఫూర్తి పొందినట్టు నాసా ప్రకటించింది.

ఇస్రో.. మీరు మాకు స్ఫూర్తిదాయకం: నాసా

By

Published : Sep 8, 2019, 5:02 AM IST

Updated : Sep 29, 2019, 8:29 PM IST

చంద్రయాన్​-2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు పడిన శ్రమకు ప్రపంచవ్యాప్తంగా తగిన గుర్తింపు లభిస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. ఇస్రో ప్రయాణం నుంచి స్ఫూర్తి పొందామని ట్వీట్​ చేసింది.

నాసా ట్వీట్​

"అంతరిక్షం చాలా క్లిష్టమైన అంశం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్​-2ను దించాలన్న ఇస్రో శాస్త్రవేత్తల శ్రమకు ప్రశంసలు. మీ ప్రయాణం మాకు స్ఫూర్తినిచ్చింది. భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం."
--- నాసా.

చంద్రయాన్​-2పై పలు దేశాలు ఇప్పటికే భారత్​కు తమ మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో యూఏఈ, ఆస్ట్రేలియా చేరాయి. అంతరిక్ష పరిశోధనల్లో భారత్​ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రశంసించాయి.

ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ ట్వీట్​

జాబిల్లిపై కాలుమోపే ప్రక్రియ చివరి నిమిషంలో ఇస్రో కేంద్రానికి ల్యాండర్​ 'విక్రమ్'​తో సంబంధాలు తెగిపోయాయి. ల్యాండర్​ కోసం 14 రోజుల పాటు అన్వేషణకొనసాగుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

అంతర్జాతీయ మీడియా కథనాలు..

న్యూయార్క్​ టైమ్స్​, వాషింగ్​టన్​ పోస్ట్​, బీబీసీ తదితర ప్రముఖ వార్తా పత్రికలు చంద్రయాన్​-2పై విశేషంగా కథనాలు ప్రచురించాయి. అంతరిక్ష విభాగంలో భారత్​ సాధించిన అభివృద్ధి.. శాస్త్రవేత్తల ప్రతిభను అంతర్జాతీయ మీడియా కీర్తించింది.

"ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలకు సామాజిక మాధ్యమాల్లో విశేష మద్దతు లభిస్తోంది. ఈ ప్రయత్నం విజయవంతమైతే.. భారత కీర్తి మరింత పెరిగేది. అతి తక్కువ ఖర్చుతోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనేక విజయాలు అందుకుంది. చంద్రయాన్​-2 వ్యయం 140 మిలియన్​ డాలర్లు. అమెరికా చారిత్రక అపోలో మిషన్​తో పోలిస్తే ఇది చాలా తక్కువ."
--- వాషింగ్​టన్​ పోస్ట్​.

ఇదీ చూడండి:-చంద్రయాన్​-2: ఆఖరి క్షణంలో 'విక్రమ్​'కు ఏమైంది?

Last Updated : Sep 29, 2019, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details