తెలంగాణ

telangana

ఇంట్లో ఉంటే ఆర్థిక కష్టం- ఉద్యోగానికెళ్తే కరోనా భయం!

అమెరికాలో కరోనా బుసలు కొడుతూనే ఉంది. ఈ మహమ్మారి వల్ల స్తంభించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేలా పలు పరిశ్రమలు, వ్యాపార సంస్థల్ని తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది ట్రంప్​ ప్రభుత్వం. అయితే ఇటీవల కాలంలో ఉద్యోగాలు చేస్తున్న వారు అధికంగా వైరస్​ బారిన పడుతుండటం కలవరపెడుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే కరోనాతో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

By

Published : May 12, 2020, 6:43 PM IST

Published : May 12, 2020, 6:43 PM IST

Workplace worries mount as US tracks new COVID-19 cases
కొత్త కేసులతో ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన

ఇంట్లోనే కూర్చుని ఉంటే జీతం రాక, జీవితమే అగమ్యగోచరం అవుతుందన్న భయం. ధైర్యం చేసి విధులకు హాజరైతే కరోనా సోకుతుందన్న ఆందోళన. ప్రస్తుతం అమెరికాలో అనేక మంది పరిస్థితి ఇది. పని ప్రదేశాల్లోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని చెబుతున్న గణాంకాలు... అలాంటి వారిలో మరింత గుబులు పుట్టిస్తున్నాయి.

అక్కడే కేసులు అధికం...

మాంసాన్ని విక్రయించే కేంద్రాల్లో కేసులు అమాంతం పెరుగుతున్నట్లు ఇటీవల గణాంకాలు తెలిపాయి. కొత్తగా పనులు ప్రారంభించిన టెక్సాస్​ ఆస్టిన్​లోని ఓ నిర్మాణ సంస్థకు చెందిన కార్మికుల్లో వైరస్​ నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఇక్కడ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. వీటితో పాటు శ్వేతసౌధంలోకీ అడుగుపెట్టిన కరోనా.. ట్రంప్​ సహాయకుల్లో ఒకరికి, ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ అధికార ప్రతినిధిని బాధితులుగా చేసింది.

దుకాణాలు, కర్మాగారాలు తెరవడం వల్ల దేశవ్యాప్తంగా వైరస్​ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయనడానికి ఆస్టిన్​లో నమోదైన వైరస్​ కేసులు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఏప్రిల్​ 28 నుంచి మే 5 మధ్య అత్యధిక కేసులు వచ్చిన 15 అమెరికా రాష్ట్రాల్లో.. మాంసం విక్రయ కేంద్రాలు, జైళ్లలోనే మహమ్మారి వ్యాప్తి చెందినట్లు అధికారులు తెలిపారు.

ఉత్తర ఇండియానాలో ప్రముఖ టైసన్​ మాంసం విక్రయ కేంద్రంలో సుమారు 1,500 మందికిపైగా కరోనా సోకింది. 2,200 మంది కార్మికులు కలిగిన ఈ కంపెనీ.. కరోనా పరీక్షలు నిర్వహించకుండా ఎవరినీ పనిలో చేర్చుకోబోమని స్పష్టం చేసింది. వర్జీనియా, డెలావేర్​, జార్జియాలోని మాంసం విక్రయ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

వైద్యులు, నర్సులపైనా కరోనా పంజా..

వైరస్​ ప్రభావిత ప్రాంతమైన న్యూయార్క్​లో పని ప్రదేశాల్లోనే కాకుండా.. ఇతర కారణాల వల్ల వైరస్​ వ్యాప్తి చెందుతోందని ఓ సర్వే తెలిపింది. గత మూడు రోజుల్లో 113 ఆసుపత్రుల్లో చేరిన 1,269మంది రోగులపై చేసిన సర్వేలో.. అత్యధికంగా వైద్య సేవా సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడినట్లు తేలింది. వీరిలో నర్సులు, డాక్టర్లు, రవాణా సిబ్బంది ఉన్నట్లు న్యూయార్క్​ గవర్నర్ క్యూమో​ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details