తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాసలో కీలక సదస్సు- ట్రంప్​కు​ దక్కని చోటు

ఐరాస ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఈనెల 3, 4 తేదీల్లో జరగనుంది. కరోనాపై చర్చే ప్రధానాంశంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి.

Word leaders to address high-level, special session of UN General Assembly on COVID-19 pandemic
ఐరాసలో కరోనాపై ప్రపంచనేతల ప్రసంగం- ట్రంప్​ దక్కని చోటు

By

Published : Dec 2, 2020, 5:22 PM IST

కరోనా మహమ్మారిపై చర్చే ప్రధాన అజెండాగా ఈ నెల 3, 4 తేదీల్లో ఐరాస ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరగనుంది. ప్రపంచ దేశాధినేతల్లో కొందరు, కొవిడ్​ టీకాను అభివృద్ధి చేస్తున్న సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. సమాజం, ప్రజలు, దేశాల ఆర్థిక వ్యవస్థలపై కరోనా ఏ మేరకు ప్రభావం చూపిందనే విషయం సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

ట్రంప్​కు దక్కని చోటు..

అఫ్గానిస్థాన్​ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ, ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్​, నేపాల్​ ప్రధాని కేపీ శర్మఓలి, న్యూజిలాండ్​ ప్రధాని జెసిండా ఆర్డెర్న్​, జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​ ఈ సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పేరు లేకపోవడం గమనార్హం. ట్రంప్​కు బదులు ఆ దేశ ఆరోగ్య, మానవ సేవల మంత్రి అలెక్స్​ అజార్​.. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరుకానున్నారు.

వీరితో పాటు సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అధార్​ పునావాలా డిసెంబర్​ 4న ముందుగా రికార్డు చేసిన వీడియో ద్వారా ప్రసంగించనున్నారు. బయోఎన్​టెక్​ సహవ్యవస్థాపకులు ఉగర్​ సాహిన్, ఓజ్లెం టురేకీ, ​ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​ అభివృద్ధికి నాయకత్వం వహించిన సరా​ గిల్​బర్ట్​ ఈ ఉన్నత స్థాయి భేటీలో మాట్లాడనున్నారు.

ఇదీ చూడండి:కరోనాకు మరో టీకా- ఒక్క డోసుతోనే వైరస్​కు బ్రేక్!

ABOUT THE AUTHOR

...view details