ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 పంజా విసురుతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతున్నందున తల్లులకు వైరస్ సోకితే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా లేదా అనే అంశంలో సందిగ్ధం నెలకొంది. అలా చేస్తే బిడ్డకూ వైరస్ సోకే ప్రమాదం ఉందన్న వాదనల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.
కరోనా సోకినా.. తల్లి బిడ్డకు పాలు ఇవ్వొచ్చని తెలిపారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్. దాని ద్వారా ఇతర వ్యాధుల నుంచి పిల్లలను రక్షించవచ్చని పేర్కొన్నారు.