తెలంగాణ

telangana

ETV Bharat / international

సినీ ఫక్కీలో మహిళా ముఠా వరుస చోరీలు - మిచిగాన్​

ఛాకా క్యాస్ట్రో.. 44 ఏళ్ల మహిళ. అమెరికాలో వరుస దొంగతనాలు చేస్తూ ఇటీవలే పోలీసులకు చిక్కింది. ఏకంగా ఓ ముఠానే నడుపుతూ.. భారతీయ అమెరికన్ల ఇళ్లే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడింది. విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సినీ ఫక్కీలో మహిళా ముఠా చోరీలు

By

Published : Jun 5, 2019, 12:20 PM IST

సినీ ఫక్కీలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ఇటీవలే అమెరికా పోలీసులకు చిక్కింది ఓ ముఠా నాయకురాలు. ఆమే టెక్సాస్​కు చెందిన ఛాకా క్యాస్ట్రో. అమెరికాలో నివసించే భారతీయులు, ఆసియా వాసుల ఇళ్లే లక్ష్యంగా చాలా చోరీలకు పాల్పడిందామె.

2011-14 మధ్య జార్జియా, న్యూయార్క్​, ఓహియో, మిచిగాన్​, టెక్సాస్​లలో క్యాస్ట్రో ఎన్నో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. అదీ గుట్టుచప్పుడు కాకుండా. అందుకోసం.. పక్కా ప్రణాళికలు వేసేది క్యాస్ట్రో.

స్కెచ్​ వేస్తే అంతే...

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. ఆసియా వాసులు, భారతీయుల ఇళ్లు ఎక్కడుంటాయో ఆమెకంటే బాగా ఎవరికీ తెలియదనుకుంట. అంతలా సమాచారం సేకరించిందామె.
ఒకసారి క్యాస్ట్రో.. ఏ ఇంటినైనా లక్ష్యంగా చేసుకుంటే చోరీ చేసి తీరాల్సిందే. క్యాస్ట్రో దొంగతనం చేయాలనుకుంటే.. ముఠాకు సమాచారం చేరవేస్తుంది. వారు వెళ్లి ... ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతారు. పరిసర ప్రాంతాల్లో నిఘా ఉంచుతారు. నిశితంగా పరిశీలించి.. ఓకే అనుకున్నాకే చోరీకి సన్నద్ధమవుతారు.

సినిమాలో మాదిరి.. దొంగతనం చేసిన అనంతరం ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా చేయడంలో వీరిది అందెవేసిన చేయి. అలాంటి ప్రత్యేక రకమైన దుస్తులతో పాటు, ముఖం కనిపించకుండా వస్త్రాలు అడ్డుగా ధరించి జాగ్రత్తలు వహిస్తారు.

ముఠాలో ఒక్కొక్కరిది ఒక్కో పని. ఒకరేమో ఇంటి సభ్యులను నియంత్రిస్తారు. వారిని ఆయుధాలతో బెదిరించి, ప్రత్యేక గదిలో బంధిస్తారు. మరొకరేమో చుట్టు పక్కల నిఘా ఉంచుతారు. ఇంట్లో దొరికినకాడికి నగదు, బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్​ వస్తువులు ఇతరత్రా విలువైన సామగ్రినంతా సర్దుతారు.

ఒకప్పుడు వరుస దొంగతనాలతో దేశంలో సంచలనం సృష్టించిన ఈ ముఠా అధినేత ఇప్పుడు పోలీసులకు చిక్కింది. జైళ్లో ఊచలు లెక్కపెడుతోంది. 2019 సెప్టెంబర్​లో మిచిగాన్​ జిల్లా కోర్టు ఈమెకు శిక్షను ఖరారు చేయనుంది.

ఇదీ చూడండి:

వృక్షంపై ప్రేమతో : మర్రి చెట్టు చుట్టూ ఇల్లు

ABOUT THE AUTHOR

...view details