కాలిఫోర్నియాలోని గ్రీన్విల్లే నగరంలో ఓ మహిళ కారును దొంగలించి బీభత్సం చేసింది. పోలీసుల కథనం ప్రకారం ఒక మహిళా కారు డ్రైవరుపై నిందితురాలు పాము విసిరి బెదిరించింది. మహిళా డ్రైవరు భయంతో పరుగెత్తింది. ఆ కారును దొంగిలించింది నిందితురాలు. పారిపొయే క్రమంలో లిబర్టీ బ్రిడ్జ్ వైపు ఉన్న వాహనాలు, మనుషుల పైకి దూసుకెళ్లింది. అంతా వెంటనే అప్రమత్తం అయినందున ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
డ్రైవరుపై పాము విసిరి... కారుతో ఉడాయించి... - గ్రీన్విల్లే
కాలిఫోర్నియాలోని గ్రీన్విల్లేలో ఓ మహిళ బీభత్సం సృష్టించింది. కారు దొంగిలించి అడ్డు వచ్చిన ఇతర వాహనాలు, మనుషులపైకి దూసుకెళ్లింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
కొట్టేసిన కారుతో లేడీ కిలాడి బీభత్సం!
నిందితురాలిని మొరెనో బెరియోస్గా గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కారు దొంగతనం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనల కింద మొరెనోపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:అమెజాన్ బాస్ విడాకులకు $ 3,830 కోట్ల డీల్