తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతరిక్షంలోకి మందు బాటిళ్లు... ఎందుకో తెలుసా?​ - అంతర్జాతీయ వార్తలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 12 ఫ్రెంచ్​ వైన్​ బాటిళ్లను పంపించింది నాసా. అయితే ఇవి తాగేందుకు కాకుండా పరిశోధనల నిమిత్తం పంపింది. శూన్యం, రేడియేషన్​తో నిండిపోయిన అంతరిక్షంలో వైన్​.. ఎలా పులుస్తుందో పరిశోధించనున్నారు.

ISS-WINE

By

Published : Nov 5, 2019, 10:31 AM IST

కొత్త సంవత్సరాదికి ముందు అంతరిక్షంలోకి 12 ఫ్రెంచ్​ వైన్​ బాటిళ్లను పంపింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా. వ్యోమగాములు ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఫ్లోరిడాలోని కేప్​ కెనావరల్ నుంచి పంపింది.

అయితే ఈ మద్యం తాగేందుకు కాదు.. పరిశోధనల కోసమే అంతరిక్షానికి పంపారు. మద్యం పులిసే క్రమాన్ని అక్కడే ఏడాది పాటు గమనిస్తారు వ్యోమగాములు. శూన్యంతోపాటు రేడియేషన్​ ప్రభావం దీనిపై ఎలా ఉంటుందో పరిశీలిస్తారు.

వాణిజ్యం+పరిశోధన

ఆహార పరిశ్రమల్లో కొత్త ఉత్పత్తులు, రుచులను సృష్టించే లక్ష్యంతో ఈ పరిశోధనకు సిద్ధమయ్యారు. నాసా కూడా అంతరిక్ష కేంద్రాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం లక్సెంబర్గ్​లోని ఓ కంపెనీ ఈ మద్యం బాటిళ్లను పంపింది. ఇవి పగలకుండా లోహంతో తయారు చేసిన ప్రత్యేక బాక్సుల్లో ప్యాకింగ్ చేసింది.

ఇదీ చూడండి: సరి-బేసి ఉల్లంఘన..భాజపా ఎంపీకి రూ.4వేలు చలానా

ABOUT THE AUTHOR

...view details