తెలంగాణ

telangana

ETV Bharat / international

అధికారంలోకి వస్తే 1.10 కోట్ల మందికి పౌరసత్వం: బైడెన్​ - జో బైడెన్

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న 'జో బైడెన్' బంపర్​ ఆఫర్​ ఇచ్చారు. తాను​ అధికారంలోకి వస్తే 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్​ సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి బైడెన్​.

biden offer
అధికారంలోకి వస్తే 1.10 కోట్ల మందికి పౌరసత్వం: బైడెన్​

By

Published : Oct 15, 2020, 1:24 PM IST

Updated : Oct 15, 2020, 1:56 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో అధికార రిపబ్లికన్​, ప్రతిపక్ష డెమొక్రటిక్​ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రచారంలో జోరు పెంచాయి. ఈ నేపథ్యంలో తాను అధికారంలోకి వస్తే 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం కల్పిస్తానని హామీ ఇచ్చారు డెమొక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​. ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాయకత్వాన్ని పునరుద్ధరించటం, ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడం, వైరస్​ను అంతమొందించటమే కాకుండా వలసకార్మికులు కూడా తమ ప్రాధాన్యతలలో ఒకటిగా ఆయన పేర్కొన్నారు.

నిధుల సేకరణకు వర్చువల్​గా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు బైడెన్​. అధికారం చేపడితే తొలి 30 రోజుల్లో దేశీయ, విదేశాంగ విధానాల పరంగా ఏ విధంగా చర్యలు చేపడతారని అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానమిచ్చారు​. సరిహద్దులో కొనసాగుతున్న పరిస్థితులను పరిష్కరించాల్సిన అవసరం ఉందనీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్​ సంక్షోభాన్ని మేమూ ఎదుర్కోవలసి ఉంటుంది. 11 మిలియన్ల మందికి పౌరసత్వం కల్పించే ఇమ్మిగ్రేషన్​ బిల్లును హౌస్​, సెనేట్​కు పంపబోతున్నాం. దేశీయ, విదేశీ విధానాలలో వచ్చే ఏడాది జనవరి 21 వరకు చాలా తప్పులు జరగొచ్చు. కానీ, మరో నాలుగు సంవత్సరాలలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఉండవు. అధ్యక్షుడిగా నన్ను అమెరికా ప్రజలు ఎన్నుకుంటే.. ఆయన (ట్రంప్​) వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు కృషి చేస్తాం."

- జో బైడెన్​, డెమొక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి.

అధికారంలోకి రాగానే కరోనా కట్టడికి తమ వ్యూహాన్ని అమలు చేసి.. దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేస్తామని భరోసా కల్పించారు బైడెన్​. అమెరికాలోని జడ్​-జనరేషన్​ తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోందని, వారికి అద్భుతమైన భవిష్యత్తును కల్పిస్తామన్నారు. కరోనా వైరస్​ వల్ల దేశంలో 2.15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, వైరస్​ను కట్టడి చేయటంలో అధ్యక్షుడు విఫలమయ్యారని ఆరోపించారు.

ఇదీ చూడండి: డొనాల్డ్​కు షాక్- బైడెన్​కే భారతీయ అమెరికన్లు జై!

Last Updated : Oct 15, 2020, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details