చైనా వైరస్ కారణంగానే అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని మండిపడ్డారు ట్రంప్. మహమ్మారికి ముందు అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
" అమెరికా ఆర్థికంగా చాలా బలంగా ఉంది. కానీ, చైనా కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. ఐనా మహమ్మారి బారి నుంచి 2 మిలియన్ల అమెరికన్లను కాపాడగలిగాం. చైనా చేసిన పనిని అమెరికా ఎన్నటికీ మరిచిపోదు".
- డొనాల్డ్ ట్రంప్.