తెలంగాణ

telangana

ETV Bharat / international

'మాకు అనుకూలంగా ఉంటేనే చైనా​తో ఒప్పందం​' - చైనాతో వాణిజ్య యుద్ధంపై ట్రంప్

చైనాతో వాణిజ్య ఒప్పందం అమెరికాకు గొప్పగా అనుకూలంగా ఉంటుందని భావిస్తేనే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.  వచ్చేవారం చైనా ప్రతినిధులతో చర్చల నేపథ్యంలో ట్రంప్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మాకు అనుకూలంగా ఉంటేనే చైనా​తో ఒప్పందం: ట్రంప్​

By

Published : Oct 5, 2019, 9:33 AM IST

ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరదించేందుకు వచ్చే వారం చైనా, అమెరికా దేశాల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒప్పందం తమ దేశానికి వాణిజ్యపరంగా అనుకూలంగా ఉండాలని స్పష్టం చేశారు. లేకపోతే అసలు ఒప్పందమే కుదుర్చుకోబోమని తేల్చి చెప్పారు.

చైనాతో గొప్ప ఒప్పందం తన వల్ల మాత్రమే సాధ్యమవుతందన్నారు ట్రంప్​. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న జో బిడెన్​తో ఇది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.

" బిడెన్ ఆయన కుమారుడు ఏం చేశారో నేను గమనించిన విషయం చెప్తున్నా. వాళ్లు దేశాలను దోచుకున్నారు. మనల్ని బాధపెడుతున్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బిడెన్ విజయం సాధిస్తే ఏం చేస్తారు. మొత్తం చైనాకే కట్టబెడతారు. అలాంటి ఒప్పందం అవసరమా? దీని వల్ల అవినీతి జరుగుతుంది తప్ప మరేం లేదు. అదే నేను ఒప్పందం కుదుర్చుకుంటే రాజకీయాల గురించి పట్టించుకోను. దేని గురించి ఆలోచించను. అవినీతి మాత్రం ఉండబోదు."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.

చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి తనకే ఎక్కువ అకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్​. ఒప్పందం చాలా క్లిష్టమైందన్నారు. 100 శాతం తమకు అనుకూలంగా ఉండాలన్నారు.

ఇదీ చూడండి: హాంకాంగ్​: 'ముసుగు' నిరసనలు హింసాత్మకం

ABOUT THE AUTHOR

...view details