తెలంగాణ

telangana

ETV Bharat / international

ఘనంగా అమెరికా స్వాత్రంత్య్ర వేడుకలు

జులై 4న అమెరికా 244వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్వేతసౌధం వద్ద జరిగిన వేడుకలు ఆద్యంతం అలరించాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. దేశ ప్రజలు ఇళ్లపై జాతీయ జెండాను ఎగరేశారు.

us
ఘనంగా అమెరికా స్వాత్రంత్య్ర వేడుకలు

By

Published : Jul 5, 2020, 10:50 AM IST

Updated : Jul 5, 2020, 11:30 AM IST

అమెరికా 244వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వారాంతంలో జాతీయ దినోత్సవం జరుపుకొంటున్న నేపథ్యంలో అమెరికన్ల ఆనందం అవధులు దాటింది. జులై 4న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చారు. అమెరికా జాతీయ పతాకం ప్రతి ఇంటిపై రెపరెపలాడింది.

స్వాతంత్య్ర వేడుకలు

శ్వేతసౌధం వద్ద వేడుకలు..

శ్వేతసౌధం వద్ద ఏర్పాటు చేసిన వైమానిక విన్యాసాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన భార్య మెలానియా ట్రంప్​తో కలిసి ప్రారంభించారు. అమెరికా స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరులకు ట్రంప్ నివాళులు అర్పించారు. వైమానిక విన్యాసాలు చూసేందుకు ఉన్నతాధికారులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ట్రంప్ దంపతులు

బలప్రదర్శన

ఈ ఉత్సవాల్లో అమెరికా తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. తొలుత అధ్యక్ష విమానం ఎయిర్‌ఫోర్స్‌వన్... శ్వేత సౌధం మీదుగా గగనతల విన్యాసం చేసింది. అనంతరం యుద్ధ విమానాలు, చినూక్ ‌హెలికాప్టర్లు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి.

పారాచ్యూట్ విన్యాసం
పారాచ్యూట్ విన్యాసం
గగనతల విన్యాసం
శ్వేతసౌధం వద్ద..

ఇదీ చూడండి:అమెరికా లవ్స్ ఇండియా: ట్రంప్​

Last Updated : Jul 5, 2020, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details