అమెరికాకు చైనా గట్టి పోటీదారు అని అంగీకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది బైడెన్ సర్కార్. చైనా దూకుడు, బలవంతపు చర్యలను ఎదుర్కొంటామని స్పష్టం చేసింది.
"అమెరికా కార్మికులను ఇబ్బందులకు గురి చేసేలా చైనా వ్యవహరిస్తుందని తెలుసు. సాంకేతికత రంగంలో అమెరికాను దెబ్బతీయడానికి.. అంతర్జాతీయ సంస్థల్లో అగ్రరాజ్యం జోక్యాన్ని తగ్గించడానికి చైనా ప్రయత్నిస్తుంది. ఆ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన.. చైనా దూకుడు వ్యవహరశైలికి అద్దం పడుతోంది. అందుకే చైనా దూకుడు, బలవంతపు చర్యలను కళ్లెం వేస్తాం. ఈ మేరకు ప్రధాన సైనిక ప్రయోజనాలను బలోపేతం చేస్తాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి పెట్టుబడులు పెడతాం. భద్రతా భాగస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం "