తెలంగాణ

telangana

ETV Bharat / international

'అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటా' - వ్యోమగామి కేట్​ రూబిన్​

అమెరికా మహిళా వ్యోమగామి కేట్​ రూబిన్ వచ్చే నెలలో అంతర్జాతీయ స్పేస్​ స్టేషన్​కు బయలుదేరనున్నారు. ఆరు నెలల పాటు అక్కడే ఉండనున్నారు. అయితే నవంబర్​లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే ఓటు వేయనున్నట్టు ప్రకటించారు కేట్​. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.

Will cast my vote from Space: American astronaut Kate Ruben
'అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటా'

By

Published : Sep 27, 2020, 5:55 AM IST

అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన ఓటును అంతరిక్షం నుంచే వేయనున్నట్లు నాసా మహిళా వ్యోమగామి కేట్‌ రూబిన్‌ తెలిపారు. భూమికి 200 మైళ్ల దూరంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్‌ కేంద్రానికి అక్టోబరులో పయనమవుతున్న కేట్..‌ ఆరు నెలల పాటు అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో తన ఓటును అక్కడి నుంచి వేస్తానని ఆమె వివరించారు.

సమాజంలో ఓటుకు చాలా విలువ ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు కేట్​. అంతరిక్షం నుంచి ఓటు వేయడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. వ్యోమగాములు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడి చట్టాలు అనుమతిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌ ద్వారా వారు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

ఇదీ చూడండి-ట్రంప్ ప్లాన్​- బీ: నల్లజాతీయులకు భారీ హామీలు

ABOUT THE AUTHOR

...view details