తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​కు ఇక ప్రతి రోజు కరోనా పరీక్షలు

కరోనా విజృంభణకు చైనా చేసిన ఘోర తప్పిదం లేదా చేతకానితనం కారణమై ఉండొచ్చని మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. తన సైనిక సలహాదారుడికి వైరస్ సోకినట్టు తేలటం వల్ల ప్రతి రోజు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలిపారు.

Will be tested for coronavirus daily, says Trump
చైనా అసమర్థత వల్లే ప్రపంచానికి ఈ దుస్థితి: ట్రంప్​

By

Published : May 8, 2020, 1:53 PM IST

కరోనా విషయంలో చైనాను పదే పదే విమర్శిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ మరోసారి ఆ దేశంపై విరుచుకుపడ్డారు. చైనా పెద్ద తప్పు చేయడం వల్లనో లేక అసమర్థత కారణంగానో ప్రపంచమంతా మహమ్మారి విస్తరించిందని ఆరోపించారు.

"ప్రాణాంతక వైరస్​ను ప్రారంభ దశలోనే ఆపి ఉండొచ్చు. అలా చేయడం సులభం కూడా. కానీ ఏదో జరిగింది. ఏదో జరిగింది." అని ట్రంప్‌ తన అనుమానాలను బయటపెట్టారు. "వారు ఏదో ఘోరమైన పొరపాటు చేసుంటారు. అది వారి చేతకానితనం వల్ల కావొచ్చు. అది చాలా బాధాకరం" అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ట్రంప్.

ప్రతి రోజు పరీక్ష..

ట్రంప్​ సైనిక సలహాదారుడికి కరోనా పాజిటివ్​గా తేలిన నేపథ్యంలో ప్రతి రోజు తాను వైరస్​ పరీక్షలు చేయించుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తనతో పాటు శ్వేతసౌధంలోని సిబ్బంది అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:'మహా' ప్రమాదంపై మోదీ, వెంకయ్య దిగ్భ్రాంతి

ABOUT THE AUTHOR

...view details