కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ... అమెరికానుమరో ప్రకృతి విపత్తు వణికిస్తోంది. ఫ్లోరిడాలో కార్చిచ్చు చెలరేగి.. సుమారు 400 ఎకరాలు బూడిదయ్యాయి. ఈ క్రమంలోనే వాయివ్య ఫ్లోరిడాలో కొన్ని ప్రాంతాలను నిర్బంధించారు. ఎగసిపడుతన్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది.
అమెరికాలో కార్చిచ్చు.. 400 ఎకరాలు దగ్ధం - wild fire in america latest news
అమెరికా ఫ్లోరిడాలో కార్చిచ్చు చెలరేగింది. సుమారు 400 ఎకరాలు ఈ మంటల్లో దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు.. అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. సమీప ప్రాంతాల్లోని ప్రజలను సరక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు.
అమెరికాలో కార్చిచ్చు.. 400 ఎకరాలు దగ్ధం
ఇప్పటికే ఈ దావానలం కారణంగా గోల్డెన్ గేట్ ఎస్టేట్స్‌లోని కొల్లియర్ ప్రాంతంలో సుమారు 30 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే సమీప ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.