ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాం సేవలు(facebook server down) సోమవారం రాత్రి అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 6 గంటల పాటు ఈ సామాజిక మాధ్యమ దిగ్గజాల సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది(facebook not working ). దీంతో దాదాపు 350 కోట్ల మంది వినియోగదారులు గందరగోళానికి గురయ్యారు. యాప్‌లు ఎందుకు పనిచేయడం లేదో తెలియక(facebook whatsapp instagram ) ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ ఆరు గంటల పాటు ఏం జరిగింది? సేవలు పునరుద్ధరించడానికి ఫేస్బుక్ ఏంచేసింది? వినియోగదారుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూద్దాం.
సేవలు అంతసేపు నిలిచిపోవడానికి కారణాలేంటి?
సేవలు స్తంభించడానికి ఫేస్బుక్(facebook down today) చేసిన పొరపాటే కారణం. బ్యాక్‌బోన్ రూటర్స్ కాన్ఫిగరేషన్‌లో మార్పులు చేయడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు సంస్థ తెలిపింది. డేటా సెంటర్లు, నెట్వర్క్ ట్రాఫిక్ మధ్య సమన్వయానికి ఈ రూటర్లే అత్యంత కీలకం. ఈ కాన్ఫిగరేషన్ చేంజెస్ వల్లే డొమైన్ నేమ్ సిస్టం(DNS)లో ఎర్రర్లు వచ్చాయి. దీంతో ఫేస్బుక్ వినియోగదారులు తమ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. డీఎన్ఎస్ అంటే వైబ్‌సైట్ నేమ్‌ను ఐపీ అడ్రెస్‌గా మార్చే వ్యవస్థ. అంటే మనం Facebook.com అని ఎంటర్ చేస్తే అది దాన్ని ఐపీ అడ్రస్‌గా(69.63.176.13)గా మార్చుకుని సర్వర్‌కు రీడైరెక్ట్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే Facebook.com అనేది వ్యక్తి పేరు అయితే ఐపీ అడ్రస్ (69.63.176.13) అతని చిరునామా అన్నమాట. మొత్తానికి సమస్యను గుర్తించిన ఫేస్బుక్ ఇంజినీర్లు 6 గంటల్లో పరిష్కరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు ఏం చేశారు?
సోమవారం రాత్రి 9 గంటలకు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాం పనిచేయడం ఆగిపోగానే(instagram whatsapp down) వినియోగదారులు హైరానా పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఇంటర్నెట్ పనిచేయడం లేదా? ఫోన్ పనిచేయడం ఆగిపోయిందా? వైఫైలో సమస్యా? లేక తమ అకౌంట్ బ్లాక్ అయిందా? అనే సందేహాలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక చివరకు తమ మిత్రులకు, శ్రేయోభిలాషులకు సాధారణ టెక్ట్స్ మెసేజ్‌లు పంపించుకున్నారు. ఫేస్బుక్ కలిగించిన అసౌకర్యంతో ఆగ్రహానికి గురై ఇతర సామాజిక మధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేశారు. రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి షేర్ చేశారు. ఈ సమయంలో ట్విట్టర్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయ యాప్‌లవైపు వినియోగదారులు చూశారు. వాటి డౌన్లోడ్లు కూడా ఒక్కసారిగా పెరిగాయి.