కరోనాపై పోరులో ముందుండి నడుస్తున్న వైద్య సిబ్బందికే కొవిడ్-19టీకాను ఇవ్వడంలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రముఖ ఎన్జీఓ సంస్థ సర్గో ఫౌండేషన్ అధికారి సెమా స్గెయిర్ తెలిపారు. 'అమెరికాకు చెందిన నిపుణుల బృందం సైతం మొదట అత్యవసర విభాగాల్లో సేవలందిస్తున్న వారికి తరువాత.. వయోజనులకు టీకాను అందివ్వాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ)కు సూచనలు చేశారు. ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల'ని సెమా అన్నారు.
'కరోనా టీకా ముందు వారికే అందించాలి' - కరోనా టీకా మొదట ఎవరికి
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక మొదట ఎవరికి ఇస్తారు? ప్రస్తుతం అందరికీ తలెత్తే ప్రశ్న ఇది. అయితే కరోనాపై పోరులో ముందుండి నడుస్తున్న వైద్య సిబ్బందికే మొదటగా టీకాను అందిచాలని సర్గో ఫౌండేషన్ ప్రతినిధి సెమా స్గెయిర్ తెలిపారు. అమెరికా వైద్య నిపుణులతోపాటు ప్రపంచ శాస్త్రవేత్తలు సైతం ఇదే సూచిస్తున్నట్లు వివరించారు.
'కరోనా టీకా ముందు వారికే అందించాలి'
సీడీసీ తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్రాలు అమలు చేస్తాయని చెప్పుకొచ్చారు సెమా స్గెయిర్.వ్యాక్సిన్ను సరైన వ్యక్తులకు అందిస్తే కరోనా వ్యాప్తిని మరింత కట్టడి చేయవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి కరోనా టీకా అందిస్తారా? లేక వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇస్తారా?అనేది తెలియాల్సిఉందన్నారు.