కొవాగ్జిన్ టీకాను(Covaxin who approval) అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చాలనే అంశంపై వచ్చే వారంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)(Covaxin who approval) వెల్లడించింది.
స్వతంత్ర నిపుణుల బృందం వచ్చే వారంలో సమావేశమై.. కొవాగ్జిన్ టీకా మూడు దశల క్లినికల్ ట్రయల్స్ డేటా, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత అంశాలను సమీక్షించి అత్యవసర వినియోగ జాబితాలో చేర్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి డబ్ల్యూహెచ్‌ఓ ట్విట్టర్‌లో ప్రకటించింది.
కొవాగ్జిన్ టీకాకు సంబంధించి ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ(Bharat biotech covaxin) ఏప్రిల్‌లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమర్పించింది. ఈ క్రమంలో జూలై 6న వ్యాక్సిన్ డేటా రోలింగ్ ప్రక్రియ ప్రారంభించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చేందుకు కొవాగ్జిన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓకు(Who covaxin approval) ఇప్పటికే సమర్పించామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి:'కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు కోసం కృషి '