కరోనా మూలాలు కనుగొనేందుకు మరింత సమయం అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం పేర్కొంది. అయితే చైనా పర్యటనకు సంబంధించి విడుదల చేసిన ఈ నివేదికపై అమెరికా సహా మిత్ర దేశాలు సందేహాలు వ్యక్తం చేశాయి. డబ్ల్యూహెచ్ఓ నివేదికలో పారదర్శకత, ముఖ్య సమాచారం లోపించాయని శ్వేతసౌధం కార్యదర్శి జెన్ పాస్కీ విమర్శించారు.
"నివేదికలో ముఖ్య సమాచారం లోపించింది. అందులో కరోనా మూలాలపై ఆరు నెలల క్రితం మేము సేకరించిన సమాచారం తప్ప కొత్త విషయాలు లేవు. అందుకే మేము ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాము. చైనా పారదర్శకంగా వ్యవహరించట్లేదు. "
-జెన్ పాస్కీ, శ్వేతసౌధం కార్యదర్శి