ఆగ్నేయాసియా దేశాల్లో కొవిడ్ మహమ్మారి వేగంగా విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). వైరస్ను అరికట్టేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చింది. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పంపిణీకి సమర్థవంతమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కోరింది.
ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే.. ఆగ్నేయాసియా ప్రాంతం కొవిడ్ కోరల్లో చిక్కుకుందని డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ అన్నారు. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు బలమైన నాయకత్వం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజారోగ్య చర్యలు పాటించాలని సూచించారు పూనమ్.