తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా 'ల్యాబ్​ లీక్'​పై డబ్ల్యూహెచ్ఓ మరోసారి దర్యాప్తు! - wuhan lab leak update

కొవిడ్-19 ఆవిర్భావంపై దర్యాప్తు చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ బృందం చైనాలో మరోసారి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ల్యాబ్​ లీకేజీ సహా పలు కోణాల్లో దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. పర్యటన తేదీ ఖరారు కాకపోయినప్పటికీ త్వరలోనే వుహాన్​కు డబ్ల్యూహెచ్ఓ బృందం వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.

who scientists likely to reconsider china lab origin theory of covid
కరోనావైరస్ చైనా వైరస్ పుట్టుక

By

Published : May 26, 2021, 5:18 PM IST

గబ్బిలాలు, మింక్​లు, వుహాన్ మార్కెట్, ల్యాబ్ లీక్.. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఇప్పటికి ఏడాదిన్నర కావొస్తున్నా.. వైరస్ పుట్టుకపై ఇలాంటి ఊహాగానాలే తప్ప వాస్తవాలు బయటకు రాలేదు. ఈ ఊహాగానాల్లో ప్రపంచం అంతా ఎక్కువగా నమ్ముతున్నది వుహాన్ ల్యాబ్ లీకేజీ గురించే. చైనాలోని వుహాన్​ నగరంలో ఉన్న ల్యాబరేటరీ నుంచి కరోనా వైరస్ బయటకు వచ్చిందని కొందరి భావన. వైరస్ ఆవిర్భావంపై చైనాలో దర్యాప్తు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ).. వీటిని తోసిపుచ్చింది.

అయితే, దీనిపై డబ్ల్యూహెచ్ఓ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ల్యాబ్ లీకేజీ కోణంలో మరోసారి దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కరోనా సమయంలో జంతువులపై చైనా జరిపిన విస్తృత పరిశీలనల సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓ గతంలో పెద్దగా పట్టించుకోలేదు. వీటిపైనా ఇప్పుడు దృష్టిసారించినట్లు సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది. దీని ద్వారా వైరస్ ఆవిర్భావంపై దర్యాప్తు కొనసాగించాలని డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తలు యోచిస్తున్నట్లు వెల్లడించింది.

త్వరలోనే పర్యటన!

'చైనా పర్యటనపై మార్చిలో డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన నివేదికకు అనుబంధంగానే ఈ వివరాలను సంస్థ వెల్లడించింది. అయితే అప్పట్లో ఇది నిపుణుల దృష్టికి రాలేదు. వైరస్​పై పారదర్శకంగా ఉండాలని ఇప్పుడు చైనా వ్యతిరేకుల నుంచి ఒత్తిడి పెరగొచ్చు. డబ్ల్యూహెచ్ఓ బృందం మరోసారి ఆ దేశంలో పరిశోధనలు చేపట్టాలనే డిమాండ్ కూడా వినిపించవచ్చు' అని సీఎన్ఎన్ పేర్కొంది. చైనా పర్యటన కోసం తేదీ ఖరారు కాకపోయినప్పటికీ త్వరలోనే వుహాన్​కు డబ్ల్యూహెచ్ఓ బృందం వెళ్లే అవకాశం ఉందని ఆ వార్తా సంస్థ పేర్కొంది.

వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా సోకిందనేందుకు ఆధారాలు ఉన్నాయని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో గతంలో అనేక సార్లు వ్యాఖ్యానించారు. వైరస్​ పుట్టుకపై తమ దృష్టికి వచ్చిన ప్రతి ఆధారం.. వుహాన్ ల్యాబ్​కే దారితీస్తోందని అన్నారు.

ఇదీ చదవండి-వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా- 'అగ్రరాజ్యం' నివేదిక!

ABOUT THE AUTHOR

...view details