కరోనా బాధితులకు అందిస్తున్న ప్లాస్మా థెరపీని ఇంకా ప్రయోగాత్మక చికిత్సగానే పరిగణిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. వైరస్‌పై ఈ చికిత్స పనిచేస్తుందన్న నివేదికలపై అస్పష్టత ఉందని పేర్కొంది. కరోన బారినపడ్డ వారికి ప్లాస్మా చికిత్సను అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర అనుమతులిచ్చిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
గత శతాబ్దంలో ఈ ప్లాస్మా చికిత్సను అనేక వ్యాధులపై వినియోగించారని.. కానీ దాని ఫలితాలు మిశ్రమంగా ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్లాస్మా థెరపీని ఇంకా ప్రయోగాత్మక చికిత్సగానే పరిగణిస్తున్నట్టు.. దానిపై ఇంకా పరీక్షలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.