తక్కువ, మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో.. 12కోట్ల (120మిలియన్) కరోనా పరీక్షలు నిర్వహించేందుకు తన భాగస్వాములతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఈ పరీక్షలన్నీ ర్యాపిడ్ విధానంలో జరగనున్నాయి.
ఈ మిషన్ కోసం తొలుత 600మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కానీ మిషన్‌కు డబ్ల్యూహెచ్ఓ ఇంకా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు.
మరోవైపు ఈ ఒప్పందంపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో ఇది ఓ శుభవార్త అని అభిప్రాయపడ్డారు.
"ఈ పరీక్షలతో ఫలితాలు 15-30నిమిషాల్లోనే వస్తాయి. తక్కువ ఖర్చుతో, అత్యాధునిక పరికరాలను ఇందుకోసం వినియోగించవచ్చు. ఫలితంగా విస్తృతంగా పరీక్షలు నిర్వహించవచ్చు. ల్యాబ్‌లు లేని ప్రాంతాల్లో ఈ రకమైన పరీక్షలు ఎంతగానో పనికొస్తాయి. అయితే పరీక్షలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో నిధులను సమకూర్చాల్సిన అవసరం ఉంది."
---- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్.
ర్యాపిడ్ పరీక్షల్లో ఫలితాలు త్వరగా వచ్చినప్పటికీ.. పీసీఆర్ పరీక్షలతో పోల్చుకుంటే వీటి ఖచ్చితత్వం చాలా తక్కువ.
ఇదీ చూడండి:-భారతీయ వ్యాక్సిన్‌పై మోదీ భరోసా.. డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు